calender_icon.png 10 January, 2026 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి

09-01-2026 03:45:20 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మొగవెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మాజీ సర్పంచ్ కొడప లక్ష్మి భూమి పూజ చేశారు. సర్పంచ్ కడప శంకర్  ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ కడప లక్ష్మి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మాజీ సర్పంచ్  మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఏప్రిల్ నెలలో రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.