calender_icon.png 10 January, 2026 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నేత రామచందర్ గుండాయిజంపై జర్నలిస్టుల ఆందోళన

09-01-2026 03:22:50 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎన్టీవీ రిపోర్టర్ రమేష్ పై కాంగ్రాస్ నేత కారుకూరి రామచందర్ దౌర్జన్యoపై వెంటనే చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి జర్నలిస్టులు నల్ల బ్యాడ్జిలతో ఆందోళన చేశారు. రిపోర్టర్ రమేష్ పై దుర్భాషలాడీ చంపుతానని బెదిరింపులపై జర్నలిస్టులు భగ్గుమన్నారు. బెల్లంపల్లి కాంటా అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం జర్నలిస్టులు ఆందోళన చేశారు. రిపోర్టర్ రమేష్ పై గుండాయిజo చేసిన కారుకూరి రామచందర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన రాoచందర్ బేషరతుగా రిపోర్టర్ రమేష్ కు  క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేశారు. కాంగ్రెస్ నాయకుల గుండాయిజం నశించాలని జర్నలిస్టులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చేసిన నినాదాలు హోరెత్తాయి. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులియాల రాజు, ఉపాధ్యక్షుడు కోల వెంకటేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న కాంగ్రెస్ నాయకుల గుండాయిజానాన్ని సహించమని హెచ్చరించారు.

జర్నలిస్టులపై అనుచితంగా ప్రవర్తించిన రామచందర్ పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.  లేని యెడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి జర్నలిస్టులు వికాస్ యాదవ్, అందుగుల రమేష్, కల్వల ప్రతాప్, బడుగు శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, గరిగే వేణుగోపాల్, మేకల భీమన్న, రాధాకృష్ణ, నగరం నిరంజన్, దాసరి తిరుపతి, మోసం శ్రీనివాస్, కృష్ణ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

రామచందర్ పై ఫిర్యాదు..

ఎన్ టీవీ రిపోర్టర్ ను అనుచిత వ్యాఖలు చేసి చంపుతానని బెదిరింపులకు పాల్పడిన కాంగ్రెస్ నేత రామచందర్ పై బెల్లంపల్లి జర్నలిస్టులు రమేషతో కలిసి వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ హెచ్ వో  శ్రీనివాస్ రావుకు జర్నలిస్టులు ఫిర్యాదు కాఫీని అందజేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.