calender_icon.png 10 January, 2026 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసిపేట గురుకులంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు

09-01-2026 03:42:51 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి వేడుకల్ని  పురస్కరించుకుని విద్యార్థులు ముందస్తుగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 5వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు.

విద్యార్థులు హరినాధుని వేషధారణతో హరినాధ కీర్తనలు చేశారు. భోగి మంటలు వేశారు, పూర్ణకుంభంలోపాలు పొంగించారు. గాలిపటాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంతోష్  మాట్లాడుతూ తెలుగు ప్రజలకు సంక్రాంతి ఒక ముఖ్యమైన పంటల పండుగన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలిసేలా ప్రతి సంవత్సరం ప్రతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పండుగ ప్రకృతి కృతజ్ఞతకు కొత్తదనానికి స్వాగతం పలికే పండుగ అన్నారు.