calender_icon.png 10 January, 2026 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలను మభ్య పెట్టేందుకే శంకుస్థాపనలు

09-01-2026 03:27:24 PM

బిఆర్ఎస్ నాయకులు

అనుమతి లేకుండా పనులు ప్రారంభించడంపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు  వినతిపత్రం అందజేత 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎలాంటి అధికారిక హోదా లేని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్యామ్ నాయక్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల స్టంట్లకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు.

స్థానిక ఎమ్మెల్యేకు కూడా సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ లేని వ్యక్తులతో హడావిడిగా శంకుస్థాపనలు చేయడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత పనులకు మున్సిపాలిటీ వద్ద ప్రస్తుతం ఎలాంటి నిధులు లేవని, అలాగే ఎలాంటి సాంక్షన్లు లేదా అధికారిక ప్రొసీడింగ్స్ కూడా లేవని మున్సిపల్ కమిషనర్‌ స్పష్టం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్‌ నాయకులు సయ్యద్ నిస్సార్, దుడేలా అశోక్, చౌదరి రవి, జావేద్, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.