calender_icon.png 10 January, 2026 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సారెస్పీ నీరే తుంగతుర్తి పంటలకు జీవనాధారం

08-01-2026 12:10:02 AM

బయ్యన్న వాగు స్టేజ్2 ద్వారా నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి, జనవరి 7 : ఎస్సార్‌ఎస్పీ  జలాలు రావడం తో తుంగతుర్తి నియోజకవర్గం లోని పంటలకు జీవం పోసినట్లు ఉంటుందని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బయ్యన్న వాగు స్టేజ్2 పనుల ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు నీటిని బుధవారం ఎమ్మెల్యే మందుల సామెల్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, చివరి ఎకరం వరకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నీటి విడుదలతో నియోజకవర్గ రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సాగునీరు రావడంతో పంటలపై ఆశలు పెరిగాయని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.