16-10-2025 07:49:40 PM
మందమర్రి (విజయక్రాంతి): ఐఎన్టియుసి కేంద్ర కమిటీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమితులైన సత్యనారాయణ - సుశీల దంపతులను ఘనంగా సన్మానించారు. పట్టణంలోని మేదరి బస్తీలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కాలనీ వాసులు సత్యనారాయణ దంపతులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సత్యనారా యణ మాట్లాడుతూ మాట్లాడుతూ యూనియన్ నాయకత్వం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, యూనియన్ అభివృద్ధికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
స్వార్థ ప్రయోజనాలు లేకుండా నిస్వార్ధంగా సేవలందిస్తానని ఆయన స్పష్టం చేశారు. యూనియన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సన్మానించిన కాలనీ వాసులకు అభినందనలు తెలిపారు. అంతే కాకుండా తనకు పదవి రావడానికి సహకరించిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్, కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పిల్లి సాయిలు, తులసి మదన్, నిచ్చకోల నాగేశ్వరరావు, పిల్లి రవి, తోట నరహరి, ఆకుదారి లక్ష్మీనారాయణ, నూతి అంజయ్య, నర్సింగోజు వీరబ్రహ్మచారి, మాదరి కీర్తి రావు, మొలుమూరి రమేష్, మంత్రి నర్సయ్య, కొంటూ రాజనర్సు, లక్ష్మణ్, శనిగారపు చంద్రమౌళి, లక్ష్మి లు పాల్గొన్నారు.