calender_icon.png 17 October, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

16-10-2025 10:13:49 PM

తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త!!

శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల 114 మంది విద్యార్థిని, విద్యార్థులు ప్రముఖ సంఘ సేవకులు, తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త, వారి సొంత నిధుల నుండి ఏకరూప యూనిఫామ్స్(దుస్తులు) అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పబ్బా మహేష్ గుప్తకు కళాశాల ప్రిన్సిపల్ శైలజ విన్నపు మేరకు కళాశాలకు డెస్క్లు ల్యాప్టాప్ త్వరలో అందిస్తానని తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటదని తాజా మాజీ జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా అన్నారు. కళాశాల విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదువుకొని జిల్లాలో మంచి ర్యాంకులు తీసుకురావాలని కోరారు. శివంపేట  కళాశాలకు పేరు వచ్చేలా కళాశాల అధ్యాపకులకు విద్యార్థులకు కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్  మండల పార్టీ అధ్యక్షులు రాజా రమణగౌడ్, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, స్థానిక సర్పంచ్ తాజా మాజీ పత్రాల శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్, గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దగళ్ల లక్ష్మీ నరసయ్య పిఏ సి ఎస్ డైరెక్టర్, పాపమొల్ల యాదగౌడ్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ సర్పంచులు, కొంతన్ పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మగ్దుంపూర్ మాజీ సర్పంచ్ సోము అశోక్,దంతన్ పల్లి,మాజీ సర్పంచ్, దుర్గేష్,తాజా మాజీ వార్డ్ సభ్యులు, బాసంపల్లి పోచగౌడ్  వంజరి కొండల్,కొవ్వురి వెంకటేష్, ముయ్యడిసింహం,కమలయ్య గారి లక్ష్మీనారాయణ,పంబాల సంతోష్,అలాగే బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ,నాగేశ్వరరావు బాసంపల్లి రామాగౌడ్ , త్రినేష్ గౌడ్ రవినాయక్ నవీన్ అశోక్,అరిగే ముత్యాలు పి ఎం జి  యువసేన సభ్యులు కళాశాల సిబ్బంది కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులను కళాశాల తరుపున సన్మానించారు.