16-10-2025 10:05:07 PM
అధికారుల నిర్లక్ష్యం భక్తుల అగ్రహం..
మల్యాల (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో గురువారం విషాదఛాయలు అలుముకున్నాయి. కొండగట్టు దైవ దర్శనం కోసం కుటుంబ సభ్యులతో వచ్చిన ఓ భక్తురాలు విగత జీవిగా మారింది. గోదావరిఖని చెందిన వెనగంటి రాజేశ్వరి(63) అనే వృద్ధురాలు విద్యుదాఘాతంతో మృతి చెందింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కోనేరు వైపు వెళ్లగా విద్యుత్ షాక్ తగిలింది. అక్కడే ఉన్న తన కోడలు సరితకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స పొందుతూ రాజేశ్వరి మృతి చెందింది. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఓ వానరం కూడా మృతి చెందినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలవడం భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.