16-10-2025 10:35:07 PM
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
వేములవాడ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని బస్ డిపో వద్ద గల 144 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందనీ తెలిపారు.
గత ప్రభుత్వం పది సంవత్సరాలపాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయలేదని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినట్లుగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెసి నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందనీ తెలిపారు. బస్ డిపో వద్ద 144ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే గతంలో మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు..వాటి నిర్మాణం కోసం టెండర్ పక్రియ పూర్తి చేసి త్వరలోనే నిర్మాణాలను డిసెంబర్ 15 లోపు పూర్తి చేయాలని అధికారులకు విప్ సూచించారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, గృహ నిర్మాణ శాఖ పిడి శంకర్ ఆర్ అండ్ బి డి ఈ శాంతయ్య, వరప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు....