16-10-2025 07:47:38 PM
భీమిని (విజయక్రాంతి): భీమినీ మండల కేంద్రంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏర్పాటు కోసం మంచిర్యాల బెల్లంపల్లి హెచ్డిఎఫ్సి అధికారులు భీమినినీ సందర్శించి బ్యాంక్ ఏర్పాటు కోసం ప్రజలతో మాట్లాడారు. భీమినీ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఒకటే ఉండటంతో ప్రజలకు బ్యాంక్ సౌకర్యాలు అందనీ పరిస్థితి ఇక్కడ నెలకొంది. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల లోన్లు పొదుపుల కోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి సంఘాల సభ్యులకు నెలకొందని దీంతోపాటు రైతులకు సరైన రుణాలు అందని పరిస్థితి మండలంలో నెలకొంది దీంతో విషయం తెలుసుకున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులు నూతన శాఖను ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఎక్కడ బ్యాంకు ఏర్పాటు చేస్తే బాగుంటుంది స్థలం ఎక్కడ అణువుగా ఉందో తెలుసుకోవడానికి భీమినికి వచ్చారు.
ప్రజలతో కాసేపు మాట్లాడి బ్యాంకు ఏర్పాటు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ఇక్కడ నెలకొల్పితే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని కచ్చితంగా బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రజలు బ్యాంక్ అధికారులకు సూచించారు .ఒకటే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉండడంతో రైతులకు సేవలు పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండడంతో పాటు రైతులకు రుణాలు కూడా లభించే అవకాశం విరివిగా ఏర్పడుతుంది మళ్లీ ఒకసారి భీమిని నీ సందర్శించి, బ్యాంకు ఏర్పాటు పరిశీలించి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని బ్యాంక్ అధికారులు హామీ ఇచ్చినట్లు ప్రజలు తెలిపారు.