16-10-2025 10:17:54 PM
- దశాబ్దల కాలం నుండి మునుగోడుకు అన్యాయమే జరుగుతుంది
- పుట్టిన నాటి నుండి నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది,కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఎక్కడ చెయ్యి చాప లేదు కష్టకాలంలో కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆస్తులు అమ్ముకొని బతికించే విధంగా పనిచేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సంఘటన సృజన్ అభియాన్ లో భాగంగా డిసిసి అధ్యక్షుని ఎంపిక కొరకు నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకోవడానికి గురువారం మునుగోడు కు ఎఐసిసి మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరంజన్ మహంతితో పిసిసి పరిశీలకులు మునుగోడు లోని క్యాంప్ కార్యాలయంలో హాజరై ముఖ్య కార్యకర్తలు నాయకులతో డిసిసి అధ్యక్షుని ఎంపికకు సంబంధించి అభిప్రాయాన్ని తీసుకొని మాట్లాడారు.
డిసిసి అధ్యక్షులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసి ఎవరిని ఎంపిక చేసిన మద్దతిస్తామని, రాజ్ గోపాల్ రెడ్డి గారికి అధిష్టానం ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవాలని ఏకవాఖ్య తీర్మానం చేశారు. రాజధానికి కూతబెట్టి దూరంలో ఉన్న మునుగోడు వెనకబడే ఉంది, దశాబ్దాలుగా మునుగోడు లో అభివృద్ధి జరగకుండా అన్యాయం జరిగింది. ఇప్పటికి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది అని అన్నారు. ఎఐసిసి పెద్దలు ఎవరిని డిసిసి అధ్యక్షులు గా ఎంపిక చేసిన మాకు అభ్యంతరం లేదు అని తెలిపారు.
బిశ్వరంజన్ మహంతి, ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ...
తెలంగాణలో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న లీడర్ రాజగోపాల్ రెడ్డి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ వల్లనే రాష్ట్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది.రాజగోపాల్ రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పేరున్న నేత, ఆయన స్థాయి కి మంత్రి పదవనేది తక్కువే, అంతకు మించిన కేపాసిటీ ఉన్న నేత అని అన్నారు. మీ ఓపికకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అధిష్టానానికి మీ ఆవేదనను మీ కోరికను తెలియజేస్తాను తెలిపారు.నేను తిరిగిన ఏ నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రేమ ఎక్కడ కూడా చూడలేదు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు కోరికను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాం స్పష్టం చేశారు.
అధిష్టానం మునుగోడుకు ఇచ్చిన కమిట్మెంట్ ని నిలబెట్టుకోవాలి...
- ఎమ్మెల్సీ శంకర్ నాయక్
అధిష్టానం మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టి,వెనుకబడిన మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ముఖ్య కార్యకర్త ఏఐసీసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసి లలో ఎవరిని డిసిసి అధ్యక్షులుగా ఎంపిక చేసిన మా మద్దతు ఉంటుందని అన్నారు. కొందరు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలం లో వున్నపుడు రాజగోపాల్ రెడ్డిగారు పార్టీని బ్రతికించారని గుర్తు చేశారు.2009 నుండి నేటికీ ప్రతిపక్షాలకు ఎదురొడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెడుతున్నాడని, మొన్నటికి మొన్న ఎంపీ ఎన్నికల్లో ఎవరికీ తెలియని అభ్యర్థిని ఎంపీగా గెలిపించి సత్తా చాటాడని అన్నారు. ఎంపీగా గెలిపించి వస్తే మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చి హామీ నిలబెట్టుకోవాలని తెలిపారు.
రాజగోపాల్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలో పేరున్న నాయకుడని, ఆయన స్థాయికి మంత్రి పదవి చిన్నదని, ఇంకా పెద్ద పదవులు అధిష్టించే సత్తా ఉన్న నాయకుడని విశ్వరంజన్ మహంతి కొనియాడారు.ఖచ్చితంగా మీ ఆవేదనను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని, మీ ఓపికకు తగ్గ ప్రతిఫలం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో క్రేజీ ఫాలోవర్స్ ఉన్న నాయకుడు రాజగోపాల్ రెడ్డి ఆయనకు అధిష్టానం ఇచ్చిన హామీని నిలబెట్టాలని ఏఐసిసి ప్రతినిధి ద్వారా రిపోర్ట్ పంపిస్తామని అన్నారు.ఎమ్మెల్సీ, ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ కొనసాగుతున్నారని తెలిపారు.ఈ సమావేశంలో ఎఐసిసి మాజీ జనరల్ సెక్రెటరీ బిశ్వరంజన్ మహంతితో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పిసిసి పరిశీలకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ వ్యాప్త ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు ఉన్నారు.