calender_icon.png 17 October, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాల శాఖ ద్వారా అందించాలి

16-10-2025 10:01:19 PM

రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి..

వరంగల్ (విజయక్రాంతి): నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లోని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్టోరల్ అధికారి కార్యాలయం నుండి ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు-కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి మాట్లాడుతూ నూతనంగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు. ఓటరు జాబితాలో 100 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లను గుర్తించి వారి వయసును తగిన ఆధారాలతో సమర్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ విసిలో డిఆర్ఓ, ఆర్డీవో వరంగల్ ఇన్చార్జ్ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి సంబంధిత తహసీల్దార్లు  పాల్గొన్నారు.