calender_icon.png 17 October, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మన శంకరవర ప్రసాద్ గారు’ సెట్స్‌లో క్రికెటర్ తిలక్‌వర్మ

16-10-2025 10:10:04 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ సెట్స్‌లో యువ క్రికెటర్ తిలక్‌వర్మ సందడి చేశారు. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్‌వర్మను చిరంజీవి ఆహ్వానం మేరకు గురువారం షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. వర్మకు చిరంజీవి శాలువాతో సన్మానించారు. మ్యాచ్‌లోని ఆయన మెమొరబుల్ మూమెంట్‌ని ఫ్రేమ్ చేసిన ఫోటోను బహూకరించారు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సత్తా చాటారంటూ ఈ సందర్భంగా తిలక్‌వర్మను చిరు అభినందించారు. కృషి, క్రమశిక్షణ కేవలం క్రీడలోనే కాకుండా జీవితంలోనూ విజయానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నయనతార, కేథరిన్ ట్రెసా, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపాటి, సుస్మిత కొణిదెల పాల్గొన్నారు.