28-11-2025 12:00:00 AM
అయిజ, నవంబర్ 27 : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన థాయ్ కాండో 41 కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచి వెండి పథకం సాధించిన ఐజ పట్టణ విద్యార్థి శివశంకరును మాస్టర్ శేక్షావలి (కాంగ్రెస్ నాయకులు) ఘనంగా శాలువాతో సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో పథకాలు సాధించి ఐజకు మరియు తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనంతరం బెల్టు ఎగ్జామ్ లో ప్రమోషన్ పొందిన విద్యార్థులకు మాస్టర్ మధు కుమార్, మాస్టర్ సుధీర్ లు సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐజ పట్టణ తాయకాండ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.