28-11-2025 12:00:00 AM
జహీరాబాద్, నవంబరు 27 :న్యాల్కల్ మండల పరిధిలోని మిర్జాపూర్ గ్రామంలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ తెలిపారు. మిర్జాపూర్ గ్రామానికి చెందిన తెలుగు అంజన్న కిరాణం దుకాణంలో ఎలాంటి అనుమతులు లేకుండా అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నాడని సమాచారం మేరకు దాడి చేసి 20 బాటిళ్ళ అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెలుగు అంజన్నపై కేసు నమోదు చేశామని ఎస్త్స్ర దోమ సుజిత్ తెలిపారు.