28-11-2025 12:00:00 AM
హరే కృష్ణ హెరిటేజ్‌కు అరబిందో ఫార్మా ఫౌండేషన్ విరాళం
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): హరేకృష్ణ మూవ్మెంట్ హైదరా బాద్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మక హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్టుకు అరబిందో ఫార్మా లిమిటెడ్ దాతృత్వ సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్ నుండి కీలకమైన ఆర్థిక సహాయం లభించింది. భారతీయ సంస్కృతి, కళలు, వారసత్వాన్ని ప్రోత్సహించే గరుడ భవన్ నిర్మాణం కోసం రూ. 2 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు.
భారతదేశంలోనే అత్యంత ఎత్తున సాం స్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ హెరిటేజ్ టవర్కు వివిధ కార్పోరేట్ కంపెనీలు, వ్యక్తులు విశేషమైన మద్దతు అందిస్తు న్నారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ కె. నిత్యానందరెడ్డి, చెక్కును హరే కృష్ణ హెరిటేజ్ టవర్ వైస్ ప్రెసిడెంట్ కౌంతేయ దాస ప్రభూకు అందజేశారు.
ఈ సందర్భంగాకె. నిత్యా నందరెడ్డి, పి. శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా లిమిటెడ్, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్లు మాట్లాడుతూ.. భారతీయ సాం స్కృతిక విలువలను పరిరక్షిం చేందుకు, సమగ్ర సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఇది అరబిందో ఫార్మా వైఖరిని ప్రతిబింబించే విరాళం అని వారు తెలిపారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూ వ్మెంట్ హైదరాబాద్ ప్రెసిడెంట్, సత్య గౌరచంద్ర దాస ప్రభూ హృదయపూర్వక కృ తజ్ఞతలు తెలిపారు.