27-10-2024 12:00:00 AM
పీకేఎల్ 11వ సీజన్
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ హ్యాట్రిక ఓటమి మూటగట్టుకుంది. శనివారం గచ్చిబౌలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 37-41తో దబంగ్ ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. తొలి హాఫ్‌లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన టైటాన్స్ రెండో సగం లో అదే జోరు చూపించలేకపోయింది.
తె లుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షెరావత్ 18 పా యింట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రైడ ర్ అనీశ్ నర్వాల్ 9 పా యింట్లు సాధించాడు. దబంగ్ ఢిల్లీ తరఫున కెప్టెన్ నవీన్ కుమార్, డిఫెండర్ ఆశు మాలిక్ చెరో 15 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పో షించారు. అంతకముందు యు ముంబా, బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ 31-31తో టై అయింది.
ఈ సీజన్‌లో ఒక మ్యాచ్ టై కావడం ఇదే తొలిసారి. యు ముంబా తరఫున రైడర్ మన్‌జీత్ 7 పాయింట్లు సాధించగా.. డిఫెండర్ సోంబిర్ 5 పాయింట్లు స్కోరు చేశాడు. ఇక బెంగాల్ వారియర్స్ నుంచి రైడర్ మనిందర్ సింగ్ 8 పాయింట్లు స్కోరు చేశాడు.