27-10-2024 12:00:00 AM
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న పాన్ పసిఫిక్ ఓపెన్‌లో మాజీ చాంపియన్ సోఫియా కెనిన్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో అమెరికాకు చెందిన సోఫియా 6-4, 6-4తో తొమ్మిదో సీడ్ కేటీ బౌల్టర్ (ఇంగ్లండ్)ను చిత్తుగా ఓడించింది. గంటకు పైగా సాగిన పోరులో కెనిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
మ్యాచ్‌లో ఒక్క ఏస్ కొట్టిన కెనిన్ 3 బ్రేక్ పాయింట్లు కాచుకుంది. 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన కెనిన్ అదే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచింది. మరో సెమీస్ పోరులో ఏడో ర్యాంకర్ జెంగ్ డయా నా షాడైర్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. నేడు జరగనున్న ఫైనల్లో కెనిన్‌తో జెంగ్ అమీతుమీకి సిద్ధమైంది.