27-10-2024 12:00:00 AM
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బత్రా వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీటీ)లో సంచలన ప్రదర్శన నమోదు చేసింది. ఫ్రాన్స్‌లోని మాంటెపెల్లియర్ వేదికగా జరుగుతున్న టోర్నీలో మనికా 14వ ర్యాంకర్‌ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మనికా ౩ధో౧ తో రొమేనియాకు చెందిన బెర్నాడెట్టె సాక్స్‌ను చిత్తు చేసింది.
ఈ విజయంతో బెర్నాడెట్టెపై రికార్డను మనికా 6 మెరుగుపరుచుకో వడం విశేషం. ఆగస్టులో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లోనూ మనికా ప్రిక్వార్టర్స్‌లో బెర్నాడెట్టెకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక క్వార్టర్ ఫైనల్లో మనికా చైనా ప్యాడ్లర్ కియాన్ తియాన్హిని ఎదుర్కోనుంది. ఇదే టోర్నీలో ఆడుతున్న తెలుగు ప్యాడ్లర్ ఆకుల శ్రీజ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.