calender_icon.png 26 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

26-12-2025 03:01:19 AM

  1. కాగజ్‌నగర్‌కు చెందిన నలుగురు మహిళల మృతి
  2. ఐదుగురి పరిస్థితి విషమం

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): మహారాష్ట్రలోని దేవాడ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగజ్‌నగర్‌లోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ జాకీర్ కుటుంబసభ్యు లు, బంధువులతో కలిసి చికిత్స నిమిత్తం మహారాష్ట్రలోని నాగపుర్‌కు వెళ్లారు. చికిత్స పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో దేవాడ సమీపంలోకి రాగానే వీరి కారు అదుపు బ్రి డ్జిపై నుంచి కింద పడిపోయింది.

ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న జాకీర్ భార్య సల్మా బేగం, కుమార్తె శబ్రీమ్‌తోపాటు ఆఫ్జా బేగం, సహార అక్కడికక్కడే ప్రా ణాలు వదిలారు. మృతి చెందినవారు అం దరూ మహిళలే. గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వారిని వెంటనే మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నలుగురి మృతి తో నిజాముద్దీన్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.