26-12-2025 02:16:28 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పాలక సంస్థ భౌగోళిక, పరిపాలనా స్వరూ పం పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్లుగా జరుగుతున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ పరిధిని మరింత విస్తృతం చేస్తూ, చుట్టుపక్కల ఉన్న పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేసుకోవడంతో జీహెచ్‌ఎంసీ వార్డుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. కార్పొరేషన్ పరిధిలోని వార్డుల సంఖ్యను ఏకంగా 300కు పెంచు తూ, వాటి సరిహద్దులను ఖరారు చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ గురువారం తుది నోటిఫికేషన్ జారీ చేశారు.
దీంతో డీలిమిటేషన్ ప్రక్రియపై ఉన్న ఉత్కంఠకు తెరప డింది. నూతనంగా ఏర్పడిన 300 వార్డులు ఏవి? మీ ప్రాంతం ఏ వార్డు పరిధిలోకి వస్తుంది? దాని సరిహద్దులు ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తాయి. అనే పూర్తి వివరాలను పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచారు. జీహెచ్‌ఎంసీ అధికారిక వ్బుసైట్ www.ghmc.gov.inలోకి వెళ్లి వార్డుల వారీగా మ్యాప్‌లను, సరిహద్దుల వివరాల ను పరిశీలించవచ్చు. జీహెచ్‌ఎంసీ ప్రధాన, అన్ని జోనల్ ఆఫీసులు, సర్కి ల్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై కూడా గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రదర్శించనున్నారు.
గ్రేటర్‌లో కలిసిన 27 మున్సిపాలిటీలు
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విలీనంతో జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం, జనాభా భారీగా పెరిగాయి. ఈ పెరిగిన జనాభా నిష్పత్తికి అనుగుణంగా పరిపాలన సౌలభ్యం కోసం వార్డుల సంఖ్య ను పెంచక తప్పలేదు. ఈ క్రమంలో పాత 150 వార్డుల స్థానంలో.. రెట్టింపు సంఖ్యలో 300 వార్డులను ఏర్పాటు చేస్తూ అధికారు లు పునర్విభజన ప్రక్రియను పూర్తి చేశారు.
చట్టబద్ధంగా ప్రక్రియ పూర్తి
వార్డుల విభజన ఏకపక్షంగా జరగలేదని, ప్రభుత్వం నిర్దేశించిన చట్టపరమైన విధివిధానాల ప్రకారమే జరిగిందని కమిషనర్ కర్ణన్ స్పష్టం చేశారు. జీ.ఓ. 570, 291: ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ. 570, మెట్రోపాలిటన్ ఏరి యా, పట్టణ అభివృద్ధి చట్టంలోని జీ.ఓ. ఎం ఎస్. 291 నిబంధనలను పక్కాగా అమలు చేశారు. సవరించబడిన తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన చట్టం- 1996లోని ‘రూల్ 11ను అనుసరించి వార్డుల సరిహద్దులను నిర్ణయించారు. ఫైనల్ నోటిఫికేషన్ ఆధారంగానే భవిష్యత్తులో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 300 వార్డులకు జరగనున్నాయి.
12 జోన్లు, 60 సర్కిళ్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని అవుటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నేపథ్యంలో.. పాలనా సౌలభ్యం కోసం జోన్లు, సర్కిళ్ల సంఖ్యను భారీగా పెంచింది. ఇప్పటివరకు ఉన్న వ్య వస్థను సమూలంగా మారుస్తూ, జోన్ల సంఖ్యను, సర్కిళ్ల సంఖ్యను ఏకంగా రెట్టిం పు చేసింది. దీంతో ఇకపై జీహెచ్‌ఎంసీ 12 జోన్లు, 60 సర్కిళ్లుగా సేవలు అందించనుంది. పాత పద్ధతిలో కేవలం 6 జోన్లు, 30 సర్కిళ్లతో ఇంత పెద్ద నగరాన్ని పర్యవేక్షించడం కత్తి మీద సాములా మారింది. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, పాలనా వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రస్తుతం ఉన్న 6 జో న్లను 12 జోన్లకు పెంచారు. 30 సర్కిళ్లను 60 సర్కిళ్లకు పెంచారు.
కొత్త జోన్లు, ఆఫీసులు ఇవే..
కొత్తగా ఏర్పాటు చేసిన 6 జోన్ల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అవి ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్. పాత వాటితో కలిపి మొత్తం 12 జోన్ల ద్వారా కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పాలన సాగించనున్నారు.
ఆఫీసుల మార్పు ఇలా..
కొత్తగా జోన్లు, సర్కిళ్లు పెరిగినప్పటికీ.. నూతన భవనాల నిర్మాణం కోసం వేచి చూడకుండా, అందుబాటులో ఉన్న వనరులతోనే తక్షణమే పాలన ప్రారంభిం చేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తు తం ఉన్న సర్కిల్ కార్యాలయాలను అప్గ్రేడ్ చేసి.. వాటిలోనే కొత్త జోన ల్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తు తం ఉన్న వార్డు కార్యాలయాలను నూతన సర్కిల్ కార్యాలయాలుగా మారుస్తారు. దీనివల్ల కార్యాలయాలు ప్రజలకు మరింత దగ్గరవుతాయి. వార్డు స్థాయిలోనే సర్కిల్ స్థాయి అధికారి అందుబాటులో ఉండ టం వల్ల పౌర సేవలు జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు, పన్ను చెల్లింపులు, ఫిర్యాదులు వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తు న్నారు. త్వరలోనే ఈ కొత్త కార్యాలయాల నుంచి పూర్తి స్థాయి పరిపాలన ప్రారంభం కా నుందని ఉన్నతాధికారులు తెలిపారు.