25-09-2025 01:03:12 AM
రైతుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు
ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవెల్లి వీరభద్రరావు ప్రమాణ స్వీకారం..
966 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, 19 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అశ్వరావుపేట, సెప్టెంబర్ 24, (విజయక్రాంతి):రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని అర్హులైన ప్రతి నిరుపేద కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ఆర్థిక భరోసా కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలో అశ్వరావుపేట డివిజన్లో కొత్తగా ఏ ర్పాటైన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ కమిటీ, రైతు సంక్షేమానికి ము ఖ్యమైన ఘట్టంగా రైతు సలహా కమిటీ చైర్మన్ , 24 మంది సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మం త్రి మాట్లాడుతూ ఆత్మ కమిటీ చైర్మన్ పదవికి నియామకం ఒక పెద్దాయనకు న్యాయం చేయడం, రైతుల సంక్షేమం, పేదవర్గాల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ రోజున ప్రభుత్వం ఇ చ్చిన హామీలు ప్రతి పేదవాడికి నిజమవ్వాలని, రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికి ఇల్లు, ఆర్థిక మద్దతు, భరోసా భద్రత అందించడం ప్రధాన లక్ష్యం అని మంత్రి స్పష్టంగా చేశారు.
రాష్ట్రంలో ఇప్పటి కే ఇళ్ల నిర్మాణం, మహాలక్ష్మి పథకం కింద మ హిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 కే గ్యాస్, గత ప్రభత్వం ఇవ్వని రేషన్ కార్డులను ప్రజా ప్ర భుత్వం ఏర్పడిన త్వరత సుమారు 11 లక్షల మందికి నూతన రేషన్ కార్డులు, సుమారు 7 లక్షల మంది పాత రేషన్ కార్డులలో పేర్ల నమోదు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అ న్నారు.
ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నా మన్నారు.ప్రతి పేదవాడికి హక్కులు, వసతులు, సులభంగా అందించబడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ఏది చేయగలము, ఏది చేయలేము అని అంచనాతో ప్రతి వర్గానికి చెబుతూ పేదవాడి గౌరవానికి భంగం కలగకుండా ముం దుకు సాగుతున్నమన్నారు.
వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి పేదవారికి మంచి చేసే కార్యక్రమాన్ని ఈనాడు ప్రభు త్వం చేస్తుందన్నారు.శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ, ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం రాష్ట్రంలోనే మొదటిసారిగా అశ్వరావుపేట నియోజకవర్గంలో నిర్వ హించబడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో పేదవ ర్గాల సంక్షేమానికి అవకాశం సృష్టించడం గొప్ప కార్యక్రమన్నారు.
అదేవిధంగా కల్యా ణ లక్ష్మి పథకానికి సంబంధించిన చెక్కుల పంపిణీ ద్వారా పేదవర్గాలకు నేరుగా లబ్ధి చేరడం ముఖ్యమన్నారు.అనంతరం మంత్రి చేతుల మీదగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, షాదీ ముబారక్ ,కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ చితేశ్వి వి పాటిల్ కొత్తగూడెం ఆర్డీవో మధు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, హౌసింగ్ పిడి రవీంద్రనాథ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, రైతులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.