28-01-2026 12:00:00 AM
తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ విజయం సాధించాలి
గులాబీ కండువా మెడలో ఉన్న ప్రతి కార్యకర్త నాకు దైవంతో సమానం
టికెట్ రాని నాయకులు నిరాశ పడొద్దు.. పార్టీ గుర్తిస్తుంది..
మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి, జనవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడు స్తూ ఆంధ్ర పాలకుల తొత్తు రేవంత్ రెడ్డి అని మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నా రు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యములో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణములో భారీ బైక్ ర్యాలీ నిర్వ హించిన అనంతరం పట్టణ అధ్యక్షులు పలు స రమేష్ గౌడ్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమా వేశంను నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల బాని స పాలనకు చరమగీతం పాడి తెలంగాణకు కె.సి.ఆర్ విముక్తి కలిగించారని కానీ నేడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఆంధ్ర పాలకుల తొత్తుగా మారి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని వారు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కె.సి.ఆర్ సంక్షేమ పథకాలు, మనం చేసిన అభివృద్ధి వివరించి ఓట్లు అ భ్యర్థించాలని వారు పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఐకమత్యంగా పనిచేసి గెలిపించుకోవాలని టికెట్ రాని వారు ని రాశ చెందవద్దని పార్టీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. సమర్థత,సర్వేలతో అభ్యర్థుల నిర్ణయమని పార్టీ పట్ల విశ్వాసం,విధేయత,కార్యకర్తల ఏ కాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని మున్సిపల్ ఎన్నికల విజయం కె.సి. ఆర్ కి కానుక కావాలన్నారు.
పట్టణములో అభ్యర్థుల గురించి పార్టీ అంతర్గత సర్వేలు ని ర్వహిస్తుందని పార్టీ పట్ల విశ్వాసం విధేయత కార్యకర్తల ఏకాభిప్రాయం కలిగిన వాళ్లను అ భ్యర్థులుగా నిలబెడతామని అందరం సమిష్టిగా పనిచేసి గెలిపించుకోవాలని వారు పి లుపునిచ్చారు. టిక్కెట్లు రాని వాళ్ళు సమర్థు లు కారని పార్టీ అభిప్రాయం కాదని వారికి కూడా పార్టీ తగిన రీతిలో గౌరవం,ప్రాధాన్య త కల్పిస్తుందని వారు భరోసా ఇచ్చారు. పెద్ద సంఖ్యలో ర్యాలీ,సమావేశములో పాల్గొ న్న నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదా లు తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.