calender_icon.png 28 January, 2026 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల హెల్త్ కార్డులకు జీవం పోయండి

28-01-2026 12:00:00 AM

సీఎస్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విన్నపం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 27 (విజయక్రాంతి): రాష్ర్టంలోని లక్షలాది మం ది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల చిరకాల స్వప్నమైన నగదు రహిత ఆరోగ్య పథకం అమలుపై తెలంగాణ ఉద్యోగుల జే ఏసీ మంగళవారం కీలక అడుగు వేసింది. జేఏసీ ఛైర్మన్ వి లచ్చిరెడ్డి నేతత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రు ల్లో ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే అపరిమిత వైద్య సేవలు అందేలా చూడాలని వారు కోరారు.

ప్రస్తు తం కొనసాగుతున్న వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ విధానం వల్ల ఉద్యోగులు ఇబ్బం దులు పడుతున్నారని సీఎస్‌కు జేఏసీ వివరించింది. అత్యవసర సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు. దీంతో లక్షలాది రూపాయలను అధిక వడ్డీలకు అప్పు తెచ్చి చికిత్స చేయించుకోవాల్సి వస్తోందన్నారు.  ముఖ్యంగా గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి పెద్ద జబ్బులకు ప్రభుత్వం విధిస్తున్న రూ. 2 లక్షల సీలింగ్ పరిమితి ఏమాత్రం సరిపోవడం లేదని ఆయన గుర్తు చేశారు. నెలవారీ విరాళంగా వేతన స్థాయిని బట్టి ప్రతి నెల రూ. 90 నుంచి రూ. 120 వరకు లేదా అంతకం టే ఎక్కువ వాటాను చెల్లించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగి చెల్లించే మొత్తానికి సమానంగా ప్రభుత్వం కూడా తన వా టాను జమ చేయాలి.

ఈ నిధులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పర్యవేక్షణలో ప్రత్యేక ఈహెచ్‌ఎస్ ఖాతాకు మళ్లించి, ఆసుపత్రి బిల్లులను నేరుగా చెల్లించాలని కోరారు. రాష్ర్టంలోని సుమారు 3.06 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు దీనివల్ల భరోసా లభిస్తుంది. అని వారు ప్రతిపాదించారు. ఉద్యోగుల విజ్ఞప్తిపై సీఎస్ రామకష్ణారావు సానుకూలంగా స్పం దించారు.  కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.రామకష్ణ, రమేష్ పాక, పూల్‌సింగ్ చౌహాన్, గరికె ఉపేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.