calender_icon.png 25 November, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులపై ఓ నేత అసభ్యకర సోషల్ పోస్టులు

25-11-2025 05:17:07 PM

తూప్రాన్ (విజయక్రాంతి): చేసే అక్రమాలు అధికారుల దృష్టికి తీసుకెళ్తే జర్నలిస్టుల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల గురించి మాట్లాడిన బెదిరింపు వీడియోలు సెండ్ చేస్తూ మీడియా రంగాన్ని అవమానపరుస్తున్న తూప్రాన్ మున్సిపల్ మాజీ నాయకుడుపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకెళితే తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అవుసులోని కుంట కబ్జాకు గురయ్యింది.

ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు సోమవారం ఘటనా స్థలానికి చేరుకొని కబ్జా నిజమని, కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వార్త ప్రచురించగా దొంగ జర్నలిస్టులు అంటూ ఒక నేత బుజాలు ఎగరేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓ అధికారి సంబంధం లేని ఓ నాయకుడితో ఫోన్ లో విలేకరులతో చర్చలు జరపడం చూస్తే అటు అధికారులకు, నాయకులకు ఎంత గొప్ప సంబంధాలు ఉన్నాయో తెలుస్తుంది. ఏది ఏమైనా జర్నలిస్టుల గురించి తప్పుగా ప్రచారం చేస్తున్న నాయకుడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.