08-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే జారె
ములకలపల్లి / దమ్మపేట,అక్టోబర్ 7,(విజయ క్రాంతి):ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు కొమరం భీమ్ అని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కొనియాడా రు. కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం గండుగులపల్లి క్యాంప్ ఆఫీస్ వద్ద ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని గుర్తు చేశారు.
ఆయన పోరాటం అణగారిన వర్గాల స్వయంపాలన స్వాభిమానం కోసం సాగిన చరిత్రాత్మక ఉద్యమమని, ఆయన చూపిన ధైర్యం త్యాగం నేటి తరానికి స్ఫూర్తి అన్నారు.కొమరం భీమ్ వర్ధంతి కేవలం సంస్మరణ దినం కాకుండా గిరిజనుల హక్కుల పరిరక్షణకు పునరంకితం కావాల్సిన రోజుగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. కొమరం భీమ్ ఆశయాల సాధనలో భాగంగా ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన ఆదివాసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.