08-10-2025 12:00:00 AM
కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 7, (విజయక్రాంతి):త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎ న్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పి రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. సబ్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,1టౌన్ సీఐ కరుణాకర్,3టౌన్ సీఐ శివప్రసాద్, సబ్ డివిజన్లోని ఇతర పోలీస్ అధికారులు,సిబ్బంది పా ల్గొన్నారు.సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎటువంటి నేరాలు జరగకుండా ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం అవగాహన కల్పించాలని తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.భాధితులకు అండగా ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.అనంతరం డిఎస్పి కార్యాలయ పరిసరాలను పరిశీలించి,అక్కడ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.