20-05-2025 12:00:00 AM
డీఆర్‌ఎఫ్ సిబ్బందితో చెట్ల కొమ్మలను తొలగిస్తున్న కార్పొరేటర్
ముషీరాబాద్, మే19 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ అరుంధతి నగర్ బస్తి అకస్మాత్తుగా భారీ చెట్టు కూలి విద్యుత్ తీగలపై పడింది. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ విష యం స్థానికులు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ సమా చా రం అందించారు. స్పందించిన కార్పొరేటర్ వెంటనే డిఆర్‌ఎఫ్ ఎమర్జెన్సీ విభాగం ఎలక్ట్రికల్ విభాగం అధికారులను అప్రమత్తం చేశారు.
ఘటనా స్థలానికి రప్పించి డిఆర్‌ఎఫ్ మేనేజర్లు శ్రీను, సురే ష్ సిబ్బంది తో చెట్టు కొమ్మలు తొలగించేశారు. ఎలక్ట్రికల్ సీపీడీ ఎఈ నర్సింగ్ రావు సిబ్బందితో తెగిపడిన విద్ద్యుత్ తీగల క్రమబద్ధీకరణ పనులు చేపట్టారు.
కార్పొరేటర్ సూచనల మేరకు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ.వినయ్ కుమర్ ఘటన స్థలంలో జరి గిన పనులను పర్యవేక్షించారు. ఎలాంటి నష్టం జరగలేదని బస్తి వాసులు తెలిపారు. వారితో పాటు బస్తి వాసులు ఎం. ఉమేష్, శ్రీనివాస్ యాదవ్, స్వామి దాస్, శ్రీనివాస్ గౌడ్, జిడి రాజు, దాసు పాల్గొన్నారు.