20-05-2025 12:00:00 AM
నాగోల్ డివిజన్ బ్లెండ్స్ కాలనీలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ఎల్బీనగర్, మే 19 : మహిళలు వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కార్పొరేటర్ చింతల అరుణాసురేందర్ యాదవ్ సూచించారు. నాగోల్ డివిజన్ పరిధిలోని బ్లెండ్స్ కాలనీలో సోమవారం క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. నిర్వహించిన జనరల్ మెడికల్ క్యాంపులో బిజెపి సీనియర్ నాయకులు సామ రంగారెడ్డి గారు. డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి నేతృత్వంలో రొమ్ము క్యాన్సర్ పరీక్ష, అవగాహన శిబిరంలో బీజేపీ సీనియర్ నాయకుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... మహిళలంద రూ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు. రొమ్ము క్యాన్సర్ సాధారణంగా 50 ఏళు, అంతకంటే ఎక్కువ వయ స్సు ఉన్న మహిళలకు వస్తుందని, సరైన జాగ్రత్తలు, ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటే నివారణ సాధ్యమేనన్నారు. కణితులను తొలగించడానికి శస్త్రచికిత్స రొమ్ము క్యాన్స ర్కు చికిత్స చేయవచ్చని వైద్యులు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రజ్ఞా, డాక్టర్స్, కాలనీ వాసులు సరస్వతి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.