calender_icon.png 3 January, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఆకాశంలో అద్భుతం

03-01-2026 12:00:00 AM

న్యూఢిల్లీ: శనివారం రాత్రి గగన వీధిలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో వుల్ఫ్ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. భూమికి అత్యంత సమీపంలోకి రావడం వల్ల చందమామ అతిపెద్ద పరిమాణంలో కనిపించనున్నాడు. సాధారణ పౌర్ణమి కంటే ఆరోజు చందమామ సుమారు 30% ఎక్కువ వెలుగులను ప్రసరించనున్నాడు. అలాగే సాధారణం కంటే 14% పెద్ద పరిమాణంలో కనువిందు చేయనున్నాడు. ఈ అద్భుతాన్ని చూడటానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. చంద్రుడికి కాస్త పక్కనే చిన్న నక్షత్రంలా ‘బృహస్పతి’ కూడా మెరవనున్నాడు.