03-01-2026 12:00:00 AM
రోమ్: ఐరోపాలోనే అతిపెద్ద అగ్నిపర్వతమైన ఎట్నా మరోసారి ఉగ్రరూపం దాల్చింది. జనవరి 1వ తేదీ మధ్యాహ్నం భారీ విస్ఫోటనం సంభవించగా, ఇప్పటికీ లావా ఎగసిపడుతూనే ఉంది. ఇటలీలోని సిసిలీ దీవిలో ఉన్న ఈ అగ్నిపర్వతం సముద్ర మట్టానికి సుమారు 2,100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇటలీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ (ఐఎన్‌జీవీ) ప్రకారం.. లావా నెమ్మదిగా కిందికి ప్రవహిస్తున్నది. ఆ ప్రాంతంలో జనావాసాలేవీ లేకపోవడంతో ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.