10-07-2025 01:17:05 AM
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది ‘మోతెవరి లవ్ స్టోరీ’. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించారు. శివ కృష్ణ బుర్రా రూపొందించారు. అచ్చమైన ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఆగస్ట్ 8 నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధమమయింది. ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ సహజంగా రూపొందించారు.
విలేజ్ షో మూవీస్ ఆధ్వర్యంలో తీసిన ఈ సిరీస్ ఏడు ఎపిసోడ్స్‌గా అనేక ట్విస్టులతో ఉండబోతోంది. ఇందులో ఒక పెళ్లి చుట్టూ జరిగే డ్రామా అందరినీ ఆకట్టుకోనుంది బుధవారం ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. నటుడు ఆనంద్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హాజరై పోస్టర్, టైటిల్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.
లంబాడిపల్లి అనే గ్రామంలోని ఇద్దరు సోదరులు, స్వర్గస్తులైన తండ్రి ఓ మహిళకు రాసి చ్చిన ఐదెకరాల భూమి, రహస్యంగా ప్రేమించుకుంటున్న సత్తయ్య కుమార్తె అనిత (వర్షిణి రెడ్డి జున్నుతుల), అనుమవ్వ మనవడు పార్షి (అనిల్) జంట, ఈ భూ వివా దం, కుటుంబ గర్వం, వారసత్వం మధ్య సా గే ఈ సిరీస్ ఆద్యంతం అందరినీ అలరించే లా ఉంటుంది.
కార్యక్రమంలో జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, కంటెంట్ హెడ్ దేశ్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ జయంత్, నటీనటులు అనిల్, శివకృష్ణ, శ్రీకాంత్ శ్రీరామ్, వర్షిణి రెడ్డి, గంగవ్వ, నిర్మాత మధుర శ్రీధర్, సంగీత దర్శకుడు చరణ్‌అర్జున్ పాల్గొన్నారు.