calender_icon.png 10 July, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెపో కిడ్‌గా చెబుతున్నా.. కష్టపడితేనే విజయం

10-07-2025 01:18:43 AM

డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూ సుకెళ్తుతున్న సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృద యాలను దోచుకున్న  నటి మాళవిక మనో జ్ ఈ చిత్రంతో తెలుగులో  కథానాయికగా పరిచయమవుతోంది.  రామ్ గోధల దర్శకుడు.

వీ ఆర్ట్స్ బ్యానర్‌పై  హరీష్ నల్ల  ఈ చి త్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిక్ రిలీజ్ కానుం ది.  ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై.. బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. 

మంచు మనోజ్ మాట్లాడుతూ ‘సుహాస్ నాకు సోదరుడి లాంటి వాడు. ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో పాజిటివ్‌గా ఉంటా డు. ఎటువంటి నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగాడు. నెపో కిడ్స్ అయినా సినిమా పరిశ్రమలో కష్టపడాల్సిందే. కష్టపడితేనే విజ యం.

నేను ఈ విషయాన్ని ఓ నెపో కిడ్‌గా చెబుతున్నా. ఇండస్ట్రీలో సక్సెస్ కా వడం కష్టమే. కాని కష్టపడితే సక్సెస్ సాధి స్తాం. ఈ సినిమా విజయం సాధించి నిర్మాతలకు, దర్శకుడికి బ్రేక్ ఇవ్వాలి. మంచి టీమ్ తో రూపొందిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావాలి’ అన్నారు. 

సుహాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కో సం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా చూసిన తరువాత అందరూ మాళవిక ప్రేమలో పడిపోతారు. సీనియర్ ఆర్టిస్ట్ లతో నటించడం హ్యాపీగా ఉంది. ప్రతి  అబ్బాయి సక్సెస్‌ఫుల్ లైఫ్‌లో తల్లి, భార్య ఇ ద్దరూ ఎంతో కీలకంగా ఉంటారు.

ఈ పాత్రలకు సంబంధించిన ఎమోషన్స్ ఈ చిత్రం లో అందరి గుండెలను హత్తుకుంటాయి. అందరి సపోర్ట్‌తో మంచి సినిమాలు చేస్తున్నా. త్వరలో నా కెరీర్‌కు సంబంధించిన మ రిన్ని బిగ్‌న్యూస్ తెలియజేస్తాను’ అన్నారు. 

నిర్మాత హరీష్ నల్లా మాట్లాడుతూ.. ‘ స్నేహితుడు ప్రదీప్ సహకారంతో  సుహాస్ తో మా జర్నీ ప్రారంభమైంది. సుహాస్ కథ ఓకే చెప్పగానే సినిమా హిట్ అనుకున్నాను. మణికందన్ ఫోటోగ్రఫీ విజువల్స్ ఈ సినిమాలో ఎంతో రిచ్‌గా ఉంటాయి. బ్రహ్మా కడ లి వేసిన సెట్స్  చూస్తుంటే నాకే ఆశ్చర్యమేసింది. ఇంత తక్కువ ఖర్చుతో ఇలాంటి సె ట్స్ వేశాడా అనిపించింది.

రథన్ సంగీతం ఈ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది. ఈ సి నిమాకు మాటీమ్ మల్టీటాస్క్‌లు చేశారు. ద ర్శకుడు మంచి టీమ్‌ను సెట్ చేసుకున్నాడు. అందువల్లే మంచి అవుట్‌పుట్ వ చ్చింది. సినిమా చూశాను. కొత్త దర్శకుడిలా కా కుండా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చేశాడు. ఈ చిత్రంలో సుహాస్ పర్‌ఫా ర్మెన్స్ మరో రేంజ్‌లో ఉంటుంది” అన్నా రు. 

దర్శకుడు రామ్ గోధల మాట్లాడుతూ.. ‘నేను దర్శకుడిగా మారడానికి కారణం హీ రో సుహాస్. ఆ తరువాత నిర్మాత హరీష్. వాళ్లందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమా తరువాత మా  హీరోయిన్ స్టార్ హీరోయిన్‌గా మారిపోతుంది. ఆమె అభినయం ఈ చిత్రంలో అందరూ చూస్తారు.

గెస్ట్ రోల్ చేసి న హరీశ్ శంకర్, మారుతిల సహకారం మ రువలేనిది. ఈ సినిమా చేయడానికి కారణం సుహాస్. ఆయనతో ఎన్నో సినిమాలు తీ యాలని ఉంది. ఈ సినిమాలో సుహాస్ ఆల్‌రౌండ ర్ ప్రతిభ చూపాడు. ఓ మంచి సినిమాను సపోర్ట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు” అన్నారు. 

అలీ మాట్లాడుతూ ‘’ సుహాస్‌కు మామ య్య పాత్రలో నటించాను. సుహాస్‌ను చూ స్తుంటే ఓ కారణంతో మా అందరికి దూరమైన నా మేనల్లుడు గుర్తొచ్చాడు. ఈ సిని మాలో లవ్‌సీన్స్ ఎంతో ఎమోషనల్‌గా ఉం టాయి. ఈ సినిమా టీమ్ అంతా లవ్‌మ్యారేజే చేసుకున్నారు. మాళవిక సినిమా లో ఎంతో క్యూట్‌గా ఉంది. ఈమెను చూ స్తుం టే కెరీర్ మొదట్లో అనుష్కలా ఉంది. తప్పకుండా అనుష్కలా మంచి హీరోయిన్ గా ఎ దుగుతుంది.

ఈ సినిమాలో నటించిన అం దరికి ఆల్ దబెస్ట్’ అన్నారు. సమావేశంలో చిత్రలహరి బ్యానర్ అధినేత, ఈ చిత్రం కో ప్రొడ్యూసర్ ప్రదీప్ తాళ్ళపు రెడ్డి, హీరోయిన్ మాళవిక, నటుడు శ్రీనాథ్, దర్శకుడు విజయ్ కనకమేడల, రామ్ జగదీష్, సంజ నా రెడ్డి, సంగీత దర్శకుడు రథన్, రచయిత బీవీఎస్ రవి, మరో రచయిత డార్లింగ్ స్వా మి, నటులు మెయిన్, సాత్విక్, కెమెరామెన్ మణికందన్, గీత రచయితలు రామ్, శ్రీ హర్ష ఈమని తదితరలు పాల్గొన్నారు.