calender_icon.png 14 May, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మ త్యాగం వెలకట్టలేనిది

12-05-2025 01:18:53 AM

కడ్తాల మండల కేంద్రంలో  గర్భిణీ స్త్రీలకు మెడికల్  కిట్ల పంపిణి

కడ్తాల్, మే 11 : అమ్మ త్యాగం వెలకట్టలేనిదని .... ప్రతి ఒక్కరూ  తమను కనిపించిన తల్లిదండ్రులను  దైవ సమానులుగా భావించాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీ ఆర్‌ఎస్ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లు అన్నారు. ఆదివారం  మండల కేంద్రంలో  ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భి ణీ స్త్రీలకు మెడికల్ కిట్లు పంపిణి చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  మాతృ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమా లు నిర్వహించడం గొప్ప విషయం అని  ట్ర స్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ను అభినందించారు. ప్రతి ఒక్కరూ సేవా భావం అలవర్చు కోవాలని వారు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకురాలు  రజినీ సాయి చంద్, మాజీ జెడ్పిటిసి  ఉప్పల్ వెంకటేష్, మాజీ జెడ్పిటిసీలు విజిత రెడ్డి, దశరథ్ నాయక్, మాజీ సర్పంచ్ లక్ష్మి నర్సింహారెడ్డి, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు పరమేష్, మాజీ సర్పంచులు సులోచన సాయిలు, నర్సింహా గౌడ్, మాజీ ఎంపిటిసిలు లచ్చిరాం నాయక్ నాయకులు పాల్గొన్నారు.