14-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) మంగళవారం 10, 12వ తరగతుల ఫలితాల ను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పది ఫలితాల్లో 93.66 శాతం మంది వి ద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 93.60 శాతం సాధించగా ఈసారి 0.06 ఉత్తీర్ణత శాతం పెరిగింది.
23,71,939 మంది పరీక్షలు రాస్తే 22,21,636 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 95 శాతం, బాలురు 92 శాతం, ట్రాన్స్ జెండర్ 95 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి ఫలితాల్లో విజయవాడ రీజియన్ సత్తా చాటింది. 99.79 శా తంతో విజయవాడ, త్రివేండ్రం అగ్రస్థానంలో నిలిచాయి.
12వ తరగతి ఫలితాల్లోనూ బాలికలే..
12వ తరగతి ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 91.64 శాతం, బాలురు 85.70 శాతం, ట్రాన్స్‌జెండర్ వంశాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 16,92,794 మంది హాజరుకాగా, 14,96,307 (88.39 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పో ల్చుకుంటే 0.41 శాతం పెరిగింది. 12వ తరగతి ఫలితాల్లోనూ విజయవాడ రీజియన్ సత్తా చాటింది. 99. 60 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 99.32 శాతంతో త్రివేండ్రం ద్వితీయ స్థానంలో నిలిచాయి.