14-05-2025 12:00:00 AM
శ్రీనగర్, మే 13: ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రమూకల స్థావరాలను తునాతునకలు చేసిన భద్రతాబలగాలు.. మంగళవారం రా ష్ట్రీయ రైఫిల్స్ నుంచి వచ్చిన నిఘా సమాచారంతో ‘ఆపరేషన్ కెల్లర్’ ను ప్రారంభిం చాయి. జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ము ష్కరులను మట్టుబెట్టారు. మరో ఉగ్రవాది తప్పించుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్టు సమాచారం.
మొదట కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మొదలైన కాల్పులు అనంతరం షోపియాన్ అడవుల కు విస్తరించాయి. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదుల్లో షాహిద్ కుట్టాయ్, అద్నాన్ షఫీ అనే ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించారు. ఈ ఇద్దరూ షోపియాన్‌కు చెందిన వారే కా వడం గమనార్హం. కుట్టాయ్ 2023లో లష్కరేలో చేరి.. 2024 ఏప్రిల్ 28న డానిష్ రిసా ర్ట్ కాల్పుల ఘటనలో పాలు పంచుకున్నా డు.
బీజేపీ సర్పంచ్ హత్యలో కూడా ఇతడి ప్రమేయం ఉంది. షఫీ 2024లో లష్కరేలో చేరి.. షోపియాన్‌లో పని చేస్తున్న ఓ స్థానికేతర కార్మికుడిని పొట్టన పెట్టుకున్నాడు. ఆప రేషన్ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని.. వారికి దీటుగా సమాధానమిచ్చి ముగ్గురు ముష్కరులను మట్టుబె ట్టినట్లు ఆర్మీ ఎక్స్‌లో తెలిపింది.
సంఘటనా స్థలం నుంచి మూడు ఏకే-47 రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఫొటోలతో కూడిన పోస్టర్లను ఆర్మీ షోపియాన్ జిల్లాలో ఏర్పాటు చేసింది.
ఈ పోస్టర్లపై ‘టెర్రర్ ఫ్రీ కశ్మీర్’ అని రాసి ఉంది. ఫొటోల్లో ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల గురించి సమాచారం అందిస్తే రూ. 20 లక్షలు రివార్డుగా ఇస్తామని పేర్కొంది.