13-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ఆగస్టు 12 (విజయ క్రాంతి): నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల( సైన్స్ వింగ్)లోని నూతన భవనంలో సౌకర్యాలు కల్పించి తరగతులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాలు, మరమ్మతు పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో ఉన్న స్క్రాప్ తొలగించాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలకు ఎటువంటి మరమ్మతులూ చేపట్టరాద ని, వాటన్నింటినీ పూర్తిగా తొలగించాలని అన్నారు.