13-08-2025 12:00:00 AM
భద్రాచలం, ఆగస్టు 12 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుపేద గిరిజన విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట మరియు రామంతపూర్ హైదరాబాదు నందు ఇంగ్లీష్ మీడియంలో 1వ తరగతి ప్రవేశం డే స్కాలర్ గా కల్పించుటకు లక్కీ డీప్ ద్వారా బాల బాలికలను ఎంపిక చేయడం జరిగిందని పి ఎమ్ ఆర్ సి ఏ సి ఎం ఓ రమేష్ తెలిపారు.
మంగళవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు 2025 - 26 విద్యా సంవత్సరం నకు గాను గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆరుగురు(06) గిరిజన విద్యార్థులు కోయ -03, లంబాడ -02, మిగిలిన గిరిజన కులాల వారికి -01, (ఇందులో బాలురకు -03 & బాలికలకు -03) లక్కీ డీప్ ద్వారా కమిటీ సభ్యుల సమక్షంలో ఎటువంటి పొర పాటులకు తావు లేకుండా పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.
కోయా తెగకు చెందిన బాలురు ఒకటి, బాలికలు 02, లంబాడకు చెందిన బాలురు 08, బాలికలు 02, దరఖాస్తులు చేసుకున్నారని, ఇతర కులాల వారు ఒక సీటుకు దరఖాస్తులు ఏమి రాలేదని, లంబాడ తెగకు చెందిన బాలికలు సరైన సర్టిఫికెట్లు సమర్పించనందున వారిని లక్కీ డ్రాలో పేర్లు పరిగణలోకి తీసుకోలేదని, ఆరు సీట్లకు గాను నలుగురిని మాత్రమే తల్లిదండ్రులు, బాలబాలికల సమక్షంలో పిల్లల చేత లక్కీ డీప్ ద్వారా ఎంపిక చేసామని ఇందులో లంబాడా తెగకు చెందిన బాలుడు భూక్య రామ్ దీక్షిత్, కోయ తెగకు చెందిన బాలికలు కల్తీ బేబీ కీర్తి, చందా గీతా సమీక్ష, బాలుడు మర్మం యశ్వంత్ ఎంపిక అయ్యారని ఆయన అన్నారు.
ఎంపికైన బాల బాలికలు సరియైన సర్టిఫికెట్లు, ద్రవపత్రాలు సమర్పించని యెడల వారి యొక్క ఎంపికను తిరస్కరించి, వెయి టింగ్ లో ఉన్నవారికి సీట్లు కేటాయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పీజీహెచ్‌ఎం నరసింహారావు, పర్యవేక్షకు రాలు ప్రమీల భాయ్, సిబ్బంది రామకృష్ణారెడ్డి, రంగయ్య, మణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.