calender_icon.png 12 January, 2026 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి ముత్యాల ముగ్గు పోటీలు

11-01-2026 12:09:12 AM

సికింద్రాబాద్ జనవరి 10 (విజయ క్రాంతి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, న్యూ  బోయిన్‌పల్లి ఒకటో వార్డు లోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్‌లో శనివారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాం తి సంబరాలు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ సంబరాల్లో భాగంగా ముత్యాల ముగ్గు (రంగోలి) పోటీలలో మహిళలు,పిల్లలు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన రంగోలి పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి జక్కుల అమృత పూర్ణ చంద్ర రెడ్డి, జక్కుల రూప మహేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా కే. సౌందర్య ప్రథమ,శ్రీవాణి  ద్వితీయ, పావని తృతీయ బహుమతి లు పాల్గొన్న అందరికీ కన్సల్టెన్సీ బహుమతులు విజేతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.