25-11-2025 06:59:13 PM
మానవ హక్కుల కమిటీ చైర్మన్ రాథోడ్ రమేష్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్–నాగపూర్ RRR హైస్పీడ్ కారిడార్‌లో ఆప్షన్–5 ను ఖరారు చేయాలని మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ అన్నారు. జన్నారం–కవ్వల్–లింగాపూర్–పంగడి మాధుర–ఆసిఫాబాద్ మార్గం ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా అవుతుందని మంగళవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ వెంకటేష్ దోత్రేలకు వినతిపత్రం అందజేశారు. రాథోడ్ రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం సూచించిన ఆప్షన్–1 వల్ల అత్యవసర పరిస్థితుల్లో 80–120 కి.మీ అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్షన్–5 అమల్లోకి వస్తే జిల్లా నుండి హైదరాబాద్‌కు ప్రయాణ సమయం 2–3 గంటలు తగ్గి, గిరిజన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం అవుతుందని పేర్కొన్నారు.కవాల్ టైగర్ రిజర్వ్ గుండా వెళ్లే ప్రాంతంలో టన్నెల్ నిర్మాణం ద్వారా పర్యావరణానికి హాని లేకుండా ప్రాజెక్టును అమలు చేయవచ్చని ప్రజలు అభిప్రాయపడ్డారు.