22-09-2025 12:52:49 AM
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంఘటన
అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బలగాలు గాలింపు ప్రమాద స్థలాన్ని పరిశీలంచి ఎల్బీనగర్
అడిషనల్ డీసీపీ కోటేశ్వర్‌రావు, వనస్థలిపురం ఏసీబీ కాశిరెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబర్ 21: ఫొటో సదర.. ప్రాణల మీదికొచ్చి.. నీటిలో కొట్టుకుపోయి విద్యార్థి గల్లంతైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్,బేగంపేట, రసూల్‌పుర్ చెందిన క్యామ సాయితేజ (15) తపస్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం సెలవు..
అందులో దసరా సెలవులు ఇవ్వడంతో సాయితేజ తన స్నేహితులైన సాయిరాం, నందు, మహేష్, జయంత, విష్ణు సుర్నార్. కార్తీక్, సునీల్‌లతో కలిసి సరదగా కోసం సిటీ శివారు ప్రాంతంలో టూర్‌కు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఔటర్ రింగ్‌రోడ్డు అనుకుని ఉన్నపెద్ద అంబర్‌పేట్ కత్వ జలపాతనికి వచ్చారు.
జలపాతం వద్ద సరదగా ఒక్కరి తర్వాత ఒక్కరూ ఫొటోలు తీసుకుంటున్నా క్రమంలో క్యామ సాయితేజ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. గమనించిన అతని స్నేహితులు రక్షించడానికి ఎంత ప్రయత్నించిన వారి ప్రయత్నం ఫలింంచలేదు. అతని స్నేహితులు చూస్తుండగానే సాయితేజ నీటిలో కొట్టుకుపోయడాని అతని స్నేహితులు కన్నీంటిపర్యంతమయ్యారు.
క్యామ సాయితేజ స్నేహితులు వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన సంఘటనను పరిశీలించారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డీఆర్‌ఎఫ్ బలగాలు తప్పిపోయిన సాయితేజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వర్‌రావు, ఎల్బీనగర్ ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ వి. అశోక్‌రెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్ మాధవరావులు ప్రమాద సంఘటన సందర్శించారు. ఈ సంఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ వి. అశోక్‌రెడ్డి తెలిపారు.