calender_icon.png 22 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకుంటున్న నర్సరీ మేళా

22-09-2025 12:53:16 AM

-దేశ, విదేశాల నంచి వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలు 

-నేటితో ముగియనున్న హార్టికల్చర్ షో 

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న నర్సరీ మేళా సందర్శకులను ఆకట్టుకుంటోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఆరుదైన వివిధ రకాల ఔషధ, అలంకార, విదేశీ పండ్ల రకాలు, పూల మొక్కలను హార్టికల్చర్ మేళాలో సంబంధిత అధికారులు ప్రదర్శనకు పెట్టారు. దీంతో నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రకృతి ప్రేమికులతో కిటకిటలాడుతోంది. 

ఇండోర్, అవుట్‌డోరు మొక్కలు, బోన్సాయ్, క్రీపర్స్, వాటర్ లిల్లీస్, ఎగ్జాటిక్ ప్లాంట్స్, కోకో పీట్, గార్డెన్ పరికరాలు, పూల కుండీలు, స్టాండ్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపీ, కోల్‌కతా, ఢిల్లీ, హరియాణా, ముంబై, బెంగళూరు, పూనే, షిర్డీ, కడియం, చెన్నై, పచ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన పూల మొక్కలు ఈ మేళాలో కొలువుదీరాయి.

పశ్చిమ బెంగాల్‌లోని కాలీపంగ్ నుంచి తీసుకొచ్చిన ఎగ్జాటిక్ ప్లాంట్స్, అరుదైన రుద్రాక్ష, మం దరాం, బేలీఫ్, ఔషధ మొక్కలు, హైబ్రిడ్ రకాలు, విదేశీ పండ్ల మొక్కలు సహా వివిధ రకాల అలంకార మొక్కలు, అర్బర్ ఫారెస్ట్రీ రకాలు, పండ్లు, పూల మెక్కలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ మేళా సోమవా రం వరకు అందుబాటులో ఉంటుందని మేళా ఇంచార్జీ ఖాలీద్ అహ్మద్ తెలిపారు.