12-01-2026 12:43:32 AM
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
నేరేడుచర్ల, జనవరి 11: నేరేడుచర్ల గతంలో బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రస్తుతం అరాచకాలు కనిపిస్తున్నాయని, అడుగడుగునా హుజూర్నగర్ నియోజకవర్గంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. నేరేడుచర్లలో మున్సిపల్ పరిధిలో బిఆర్‌ఎస్ నాయకుల సమావేశం ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి హాజరైనారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్రామపంచాయతీ ఓటమితో భయం పట్టుకుందని, బిఆర్‌ఎస్ శ్రేణులపై కేసులు పెడుతూ, బిఆర్‌ఎస్ పార్టీని ఇంకా బలంగా చేస్తున్నారు,
ఈసారి ఒక్కరిపై కేసు పెడితే బిఆర్‌ఎస్ పార్టీ మొత్తం కూడా స్టేషన్ ముందే ఉంటుంది. హెచ్చరించారు. నేరేడుచర్ల, హుజూర్నగర్ మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉందని,కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ వేయకపోతే ఆంధ్ర, ఇలా ప్రాంతాల మధ్య కూడా పంచాయతీలు పెడుతూ రాజకీయం చేస్తున్నారని, ప్రశ్నిస్తే కేసులు, పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీనే ప్రజల శత్రువు.. కాంగ్రెస్ ను ఓడించండి. అభివృద్ధి చేసిన బిఆర్‌ఎస్ పార్టీనే గెలిపించాలి. ఇదే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ చేస్తున్న నినాదం. అన్ని వర్గాల ప్రజలని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది..ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని వివరిస్తే చాలు వారే బిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తారు అన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలని ఓటర్ల కంటే ఎక్కువగా పోలీసులను నమ్ముకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ బాబు, మాజీ డిసిసిబి డైరెక్టర్ అప్పిరెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ చందమల్ల జయబాబు, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, మాజీ మార్కెట్ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, బిఆర్‌ఎస్ నాయకులు కొణతం లచ్చిరెడ్డి, కడియం వెంకట్ రెడ్డి, రాపోలు నవీన్ కుమార్, గుర్రం మార్కండేయ, ఇంజమూరి రాములు, రాజేష్, పార్టీ కార్యకర్తలు, మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు.