calender_icon.png 12 January, 2026 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో మానసిక ఉల్లాసం

12-01-2026 12:44:54 AM

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

బెజ్జంకి, జనవరి 11:  క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని మినీ స్టేడియంలో బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 48 వ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఏ సి పి రవీందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు, యువత విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని దాంతో గుర్తింపు వస్తుందని చెప్పారు. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.

పోటీల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. క్రీడాకారులుగ్రామ స్థాయి నుంచి జతీయ స్థాయి ఎదగాలన్నారు. యువతకు డ్రగ్స్, చెడు అలవాట్లు కు పాల్పడకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ శీను, సర్పంచ్ బోల్లాం శ్రీధర్ పెద్దన్న, ఏఎంసి చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, నిర్వాహకులు జె.మధు, బైర సంతోష్, కర్రావుల శంకర్, శ్రీనివాస్ రెడ్డి, పోచయ్య, బోనగిరి మహేందర్, మధు, క్రీడకారులు తదితరులు పాల్గొన్నారు.

కళ్లేపల్లిలో... 

బెజ్జంకి మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామంలో విద్యార్థి యువత, ఓ పౌండేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి క్రికిట్ టోర్నీని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ శ్రీనులు కలిసి ప్రారంభించారు. మత్తు పదార్థాలకు యువత బానిసలవ్వకుండా క్రీడలు ఉపయోగపడుతాయని అల్పోర్ఫ్ నరేందర్ రెడ్డి అన్నారు. జీవితమంటేనే పోరాటమని, యువత సెల్ పోన్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సౌజన్య, గ్రామ సర్పంచ్ బిగుళ్ళ  మోహన్, నిర్వాహకులు బుర్ర సంజయ్, వార్డు సభ్యులు మోహన్ తదితరులు పాల్గొన్నారు.