11-11-2025 10:42:50 PM
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో మంగళవారం సాయంత్రం గుండెపోటుతో హమాలి సంఘం కార్మికుడు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ముత్తారం మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన మర్రిపల్లి రాజు(32) గత కొన్ని సంవత్సరాలుగా మంథని పట్టణంలోని హమాల సంఘంలో 8 ఏండ్లుగా కార్మికునిగా పనిచేస్తున్నాడు. సాయంత్రం మంథనిలో సిమెంట్ బస్తాలు లోడ్ దింపుతుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి హమాలి కార్మికులు హుటాహుటిన మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.