11-11-2025 10:38:19 PM
నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండలంలోని చినుర్ గ్రామస్తులు మంగళవారం అభినందించి శాలువతో ఘనంగా సన్మానించారు. గత ఏడాది కబడ్డీ, షాట్ పుట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి మౌనికను, రాష్ట్ర స్థాయి నెట్టు బాల్ క్రీడల్లో సిల్వర్ పథకం సాధించిన విద్యార్థి మనోహర్ను సన్మానించారు. విద్యార్థులకు ప్రోత్సహిస్తున్న పి ఈటి.సబత్ కృష్ణ, మీరథాయ్లను సన్మానించారు. ఇలాగే మరిన్ని క్రీడల్లో ముందుకు వెళ్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఓం కృష్ణ, కిషన్, కృష్ణ, హనుమాన్లు, నారాయణ, అంజయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.