calender_icon.png 7 May, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణాళికతో నాణ్యతగా దర్యాప్తు చేయాలి

07-05-2025 12:12:58 AM

ఎస్పీ రాజేష్‌చంద్ర

కామారెడ్డి, మే 6 (విజయక్రాంతి): ఫిర్యాదులను నాణ్యతతో కూడిన దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాజేష్‌చంద్ర మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీర్కూరు పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్హెచ్‌ఓ, మెన్ రెస్ట్రూమ్, లాక్ అప్ రూమ్, స్టేషన్ పరిసరాలు, పార్కింగ్ స్థలాలను సుదీర్ఘంగా పరిశీలించారు.

స్టేషన్ సిబ్బంది విధినిర్వహణను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ప్రతి రోజు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆధారంగా పనిచేయాలని,  ప్రతి కేసులో దర్యాప్తు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు,

ప్రజలు పోలీస్ స్టేషన్కు ఎంతో నమ్మకంతో వస్తారన్న విషయాన్ని గమనించి, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పోలీస్ సేవలు ఉండాలన్నారు.  అత్యవసర సేవలైన డయల్ - 100 కాల్స్కు బ్లూ కోలట్స్ సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు. యస్‌ఐ లు, ఇన్స్పెక్టర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.