07-05-2025 12:10:47 AM
జిల్లా జడ్పీ సీఈఓ చందర్ నాయక్
జుక్కల్, మే 6 : జుక్కల్ మండలానికి ప్రత్యేక అధికారిగా నియ మితులైన కామారెడ్డి జిల్లా జెడ్పి సీఈఓ నాయక్ మండలంలోని బంగారుపల్లి, జుక్కల్ గ్రామాలను సందర్శించి పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిష త్ కార్యాలయంలో ఏర్పాటు చేసి న సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శులదేనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎండాకాలం అయినందున తాగునీటి సౌకర్యం ఎక్కడ లేకపోయినా కార్యదర్శులు అందుబాటులో ఉండి సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఫార్మషన్ రోడ్లు వేసే విధంగా కృషి చేయాలన్నారు. దీంతోపాటు చేపల చెరువులు, నీటి కుంటలు, ఫామ్ ఫండ్ లాంటి పనులను ఉపాధి హామీ కూలీల ద్వారా చేపట్టాలన్నారు.
ఉపాధి హామీ కూలీల సంఖ్య తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధి హామీ అధికారులదే అని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఇంచార్జ్ తహసీల్దార్ హేమలత తదితరులు పాల్గొన్నారు.