calender_icon.png 21 September, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజ్ఞాన్స్ అధ్యాపకుడికి అరుదైన గౌరవం

21-09-2025 12:00:00 AM

వరల్డ్ టాప్ సైంటిస్టుగా డాక్టర్ రెహమాన్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాం తి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి విజ్ఞాన్స్ యూనివర్సిటీకి చెందిన అధ్యాపకుడు వరల్ట్ టాప్ 2శాతం సైంటిస్టుటలో చోటు సాధించారని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం సుబ్బారావు శనివారం తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలోని స్టాన్ ఫోర్టు యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని మెకానికల్ విభాగానికి చెందిన డాక్టర్ ఎండీ రెహమాన్ వరల్డ్ టాప్ 2శాతం సైంటిస్టులలో నిలిచారని తెలిపారు.

స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వారు ఆగస్టు 2025 వరకు ఉన్న ఉత్తమ సైంటిస్టుల డేటాను తీసుకోవడంతో పాటు స్టాండర్డ్ సైన్స్ మేట్రిక్స్ క్లాసిఫికేషన్లో గల 44 సైంటిఫిక్ ఫీల్డ్స్, 174 సబ్ ఫీల్డ్స్‌ను పరిగణలోనికి తీసుకుని ఈ ఫలితాలను వెల్లడించా రని తెలిపారు. అందులో భాగంగా డాక్టర్ ఎండీ రహమాన్ ప్రచురించిన రీసర్చ్ పేపర్లన్నింటిని కూడా పరిగణలోనికి తీసుకుని వరల్ టాప్ 2శాతం సైంటిస్టులలో ఒకరిగా గుర్తించారని వెల్లడించారు.

వీరితోపాటు వడ్లమూ డి విజ్ఞాన్ క్యాంపస్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకు చెందిన ప్రొఫెసర్ అంబ టి రంగారావు, డాక్టర్ కే.చంద్రశేఖర్, ఫార్మసీ డిపార్ట్మెంట్‌కు చెందిన డాక్టర్ రుద్రపాల్ మిథున్, అడ్వానడ్స్ సీఎస్‌ఈ విభాగానికి చెందిన డాక్టర్ జోత్న్సాదేవి బోడపాటి, కెమికల్ విభానికి చెందిన ప్రొఫెసర్ సుబ్బయ్యలు వరల్ టాప్ 2శాతం సైంటిస్టులలో నిలిచారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన ప్రొఫెసర్లను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు అభినందించారు.