calender_icon.png 21 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో బతుకమ్మకు ప్రాముఖ్యం

21-09-2025 12:00:00 AM

ఖమ్మం ఎస్వీఎం సెంట్రల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్లు కిషోర్, కొండ శ్రీధర్‌రావు, ఉమా కిషోర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని శ్రీనివాస్‌న గర్‌లో గల ఎస్వీఎం సెంట్రల్ పబ్లిక్ పాఠశాలలో శనివారం బతుకమ్మ, దసరా సంబు రాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో పాఠశాలకు వచ్చారు. విద్యార్థినులు వివిధ రకాల పూల తో బతుకమ్మలను అలంకరించుకొని, బతుకుమ్మ ఆడారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ కిషోర్, కొండ శ్రీధర్‌రావు, ఉమా కిషోర్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగకు చాలా ప్రాముఖ్యం ఉందని, ఈ కాలంలో దొరికే వివిధ రకాల పూలను వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.  కార్యక్రమం లో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన నృత్య ప్రదర్శనలను ఆకర్షించాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎం ప్రసాద్ పాల్గొన్నారు.